ఆధార్‌లా... భూమికో సంఖ్య
అవినీతి రహిత సమాజం కోసం ప్రత్యామ్నాయాలను శోధిస్తున్న నిపుణులు
తెరపైకొస్తున్న టైటిల్ రిజిస్ట్రేషన్
ఇప్పటికే 90 దేశాల్లో అమలు
అవినీతి రహిత సమాజం కోసం ప్రత్యామ్నాయాలను శోధిస్తున్న నిపుణులు
తెరపైకొస్తున్న టైటిల్ రిజిస్ట్రేషన్
ఇప్పటికే 90 దేశాల్లో అమలు
ఈనాడు, హైదరాబాద్, ఈనాడు డిజిటల్: ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన అవినీతి రహిత పాలన కోసం నిపుణులు తగిన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో భూమికి టైటిల్ రిజిస్ట్రేషన్ తెరపైకొస్తోంది. దీన్ని ప్రవేశపెడితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలక శాఖల్లో అవినీతిని చాలా వరకూ అరికట్టవచ్చని బలంగా చెబుతున్నారు. ఈ విధానం ఇప్పటికే 90 దేశాల్లో అమల్లో ఉందని వివరిస్తున్నారు.
టైటిల్ రిజిస్ట్రేషన్ మూడు పద్ధతుల్లో ఉంది. మొదటిది మిర్రర్ పద్ధతి. అంటే క్షేత్రస్థాయిలో భూముల వివరాలు సేకరించడం, వాటి వాస్తవ యజమానులను గుర్తించడం.
రెండోది కర్టెన్ పద్ధతి. ఇందులో ప్రస్తుత భూయజమాని ఎవరన్నది మాత్రమే నమోదు చేస్తారు. అంటే ఆ ప్లాటు లేదా భూమి గత చరిత్ర ఏమీ ఉండదు. మూడోది పరిహార విధానం. ఇది అన్నింటికన్నా కీలకమైంది. భూమి కొన్న వ్యక్తి మోసపోతే ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. భూ క్రయవిక్రయాలప్పుడు ఎలాంటి పొరపాట్లు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నేరుగా నిధులు కేటాయించడం వల్ల కానీ, లేదా బీమా కల్పించడం ద్వారా కానీ ప్రభుత్వం నష్టాన్ని భర్తీ చేయొచ్చు.
అంతా ఒకే గొడుగు కిందకు
భూములు, ఇళ్లు, భవనాల సమాచారం ప్రస్తుతం రెవెన్యూ, సర్వే, భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ లేదా పంచాయతీరాజ్ శాఖల దగ్గర వేరువేరుగా ఉంటోది. టైటిల్ రిజిస్ట్రేషన్ విధానంలో ఇదంతా ఒక దగ్గరకే వస్తుంది. ప్రజలు ఒకే పనికోసం విడివిడిగా ఈ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకసారి టైటిల్ రిజిస్ట్రేషన్ పూర్తయితే కంప్యూటరే మిగిలిన పనులన్నీ చేసేస్తుంది.

ఇది జరగాలంటే ఏం చేయాలి?
మొదట భూములన్నీ సర్వే చేసి యజమానులకు ప్రిలిమినరీ టైటిల్ ఇవ్వాలి. అనంతరం అభ్యంతరాల స్వీకరణకు కొంత సమయం ఇవ్వాలి. ఈలోపు సమస్యలు, వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించి తుది టైటిల్ ఇవ్వాలి.
మొదట భూములన్నీ సర్వే చేసి యజమానులకు ప్రిలిమినరీ టైటిల్ ఇవ్వాలి. అనంతరం అభ్యంతరాల స్వీకరణకు కొంత సమయం ఇవ్వాలి. ఈలోపు సమస్యలు, వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించి తుది టైటిల్ ఇవ్వాలి.
ముందు బిల్లు పెట్టాలి
టైటిల్ రిజిస్ట్రేషన్‌ను తెచ్చేందుకు వీలుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే, మున్సిపల్, స్థానిక సంస్థల చట్టాలను మారుస్తూ అసెంబ్లీలో బిల్లుపెట్టాలి. దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయి చట్టం అమల్లోకి తీసుకురావాలంటే దానికి తగినట్లు అధికారులు, ఉద్యోగులను నియమించాలి. టైటిల్ రిజిస్ట్రేషన్‌లో తప్పులు దొర్లి ప్రజలకు ఏమైనా సమస్యలొస్తే పరిష్కారానికి ట్రైబ్యునల్, దానిపై అప్పిలేట్ ట్రైబ్యునల్‌లను సైతం ఏర్పాటు చేయాలి.

మన వద్ద పరిస్థితులు ఇలా...
తెలంగాణలో నిజాం నవాబులు ప్రభుత్వ భూములను వదిలేసి, ప్రైవేటు భూములను మాత్రమే సర్వే చేశారు. 1952లో బూర్గుల రామకృష్ణారావు హయాంలో (కాస్రా పహాణీలు) రికార్డులు రాయడం మొదలైంది. ఆ తర్వాత నుంచి అధికారంలోకి వచ్చిన వారు ఎవరికి తోచినట్లు వాళ్లు చేయడంతో రికార్డులన్నీ తారుమారయ్యాయి. రికార్డులు సరిగ్గా లేకపోవడం, భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు పెరిగిపోవడంతో ఇప్పటి వరకు టైటిల్ రిజిస్ట్రేషన్ వైపు ఏ ప్రభుత్వమూ అడుగువేయలేదు. ఈ చిక్కులను ధరణి వెబ్సైట్ కొంత మేర తొలగించింది. 70 శాతం వ్యవసాయ భూములకు యజమానులు ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చింది. కానీ సర్వే రికార్డు లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

నిజామాబాద్‌లో భూభారతి నయం
2004-14 మధ్య కాంగ్రెస్ హయాంలో భూభారతి పథకం కింద పాత నిజామాబాద్ జిల్లాలో 90 శాతం వ్యవసాయ భూములను ఉపగ్రహాల ద్వారా చిత్రీకరించి ఎవరికి ఎంత భూమి ఉందనేది గుర్తించారు. అలాగే వ్యవసాయేతర భూముల లెక్కలు మూడేళ్లలో తేల్చవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

టైటిల్ రిజిస్ట్రేషన్ అంటే..
ప్రతి మనిషికి ఆధార్ సంఖ్యను ఇచ్చినట్లుగానే ప్రతి భూమి లేదా ప్లాటుకి ఒక యూనిక్ ఐడీ సంఖ్య(కోడ్) ఇస్తారు. సెంటు, గుంట, ఎకరా ఇలా ఎవరికి ఎంత భూమి ఉన్నాసరే యజమాని పేరుమీద ఈ ఐడీ ఇస్తారు. అది ఆన్లైన్లో నమోదు చేస్తే చాలు... సంబంధిత సర్వే నెంబరులో ఎంత భూమి ఉంది.. ఎవరి పేరుమీద ఉందనే విషయాలు తెలిసిపోతాయి. కొత్త వ్యక్తి ఆ భూమిని కొంటే ఆ ఐడీ నెంబరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ నెంబరుతో గతంలో ఎవరు కొన్నారనే వివరాలన్నీ ఉంటాయి. దీన్నే టైటిల్ రిజిస్ట్రేషన్ అని పిలుస్తారు. |
ఇప్పుడున్నంతమంది సిబ్బంది అవసరం ఉండదు
ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా భూములు, ప్లాట్లన్నింటికీ టైటిల్ రిజిస్ట్రేషన్ పూర్తయి అన్నింటికీ యూనిక్ ఐడీ కేటాయిస్తే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఇప్పుడున్నంత మంది సిబ్బంది అవసరముండదు. మ్యూటేషన్ కోసం, పేరు మార్పు కోసం తహసీల్దార్, పురపాలక, పంచాయతీ కార్యాలయాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయితే కంప్యూటరే ఈ పనులన్నీ చేస్తుంది. ఇప్పుడు ఆ పనులకు ఆయా కార్యాలయాలకు వెళ్లడం వల్ల లంచాలు ఇవ్వాల్సి వస్తోంది. |
తక్కువలో తక్కువ పదేళ్ల సమయం కావాలి
మొదటి టైటిల్‌ను 1862లో ఆస్ట్రేలియాలో ఇచ్చారు. అనంతరం ఇంగ్లాండ్, న్యూజిలాండ్, అమెరికాల్లోనూ వాడుకలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టైటిల్ రిజిస్ట్రేషన్‌ను తీసుకురావాలంటే పదేళ్ల సమయం పడుతుందనేది నిపుణుల అంచనా. ఇంగ్లాండ్‌లో 160 ఏళ్ల సమయం పట్టిందని, ఆస్ట్రేలియాలో 15 సంవత్సరాల్లో పూర్తయ్యిందని.. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో మనదగ్గర పదేళ్లలో ప్రక్రియను పూర్తి చేయొచ్చని ఓ ఐఏఎస్ అధికారి చెప్పారు. థాయ్‌లాండ్, హాంకాంగ్‌ల్లో మాదిరిగా ఉపగ్రహాలతో సర్వే చేస్తే పని మరింత సులువవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం డీఐఎల్(డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ప్రోగ్రాం) కింద నిధులివ్వడానికి సిద్ధంగా ఉందని వివరిస్తున్నారు. |
DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.
Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.
Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4
Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590
No comments:
Post a Comment