హైదరాబాద్ తూర్పున స్థిరాస్తి జోరందుకుంది. పశ్చిమ మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. పెట్టుబడిదారులు ‘లుక్‌ఈస్ట్’ అంటున్నారు. ఇటీవల ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని ప్లాట్లకు వేలం వేయగా సగటున చదరపు గజం రూ.50వేలపైనే పలికింది. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి వాసుల్లో గుబులు రేపినా.. మార్కెట్ పోకడకు అద్దం పట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపు పడింది.
హైదరాబాద్ తూర్పు ఉప్పల్, ఎల్‌బీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. సామాన్య, మధ్యతరగతి వాసులకు సొంతింటి కల నెరవేర్చుకునే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ధరలు బాగా పెరిగినా.. ఈ కేంద్రాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. స్థోమతను బట్టి వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేయవచ్చు. మున్ముందు మరింత పెరుగుతాయే తప్ప స్థిరాస్తి ధరలు తగ్గే అవకాశం లేదని రియల్టర్లు అంటున్నారు.
మెట్రోతో మరింత ఊపు
ఉప్పల్, ఎల్‌బీనగర్ వరకు మెట్రో రైలు సదుపాయం ఉండటంతో ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే సౌలభ్యం ఏర్పడింది. హైటెక్‌సిటీ, మియాపూర్ ఎక్కడికైనా ఇక్కట్లు లేకుండా వెళ్లొచ్చు. చివరి మెట్రో స్టేషన్ల నుంచి 20 కి.మీ. వరకు స్థిరాస్తి మార్కెట్ విస్తరించింది.
* సికింద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు ప్రతిపాదిత ఎంఎంటీఎస్‌తో రవాణా మరింత సౌలభ్యం కానుంది. యాదాద్రి అభివృద్ధితోనూ ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా రాబోయే రోజుల్లో ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది.

* పోచారంలో ఐటీ కంపెనీలు ఇప్పటికే ఉండటం.. కొత్త సంస్థలు వస్తుండటంతో మరింత వృద్ధికి ఆస్కారం ఉంది.
* ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఎక్స్‌ప్రెస్ వే పనులు చేపట్టారు.
* ఎల్‌బీనగర్‌లో పై వంతెన, అండర్‌పాస్‌ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరనుంది. ఇన్నాళ్లు ఈ ప్రాంత అభివృద్ధికి ట్రాఫిక్ పెద్ద సమస్యగా ఉండేది. రాబోయే రోజుల్లో చుట్టుపక్కల పెద్ద సంస్థలు నిర్మాణాలు చేపట్టేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది.
* సాగర్ రహదారిలో ఆదిభట్లలో ఐటీ, ఏరో సెజ్‌తో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
* వీటన్నింటితో ప్రస్తుతం ఈ ప్రాంతం నివాసాలకు అనుకూలంగా మారింది. భవిష్యత్తు వృద్ధికి అవకాశంగా ఉన్న మార్గంగా నిర్మాణదారులు చెబుతున్నారు.
పెద్ద ప్రాజెక్ట్‌లు వస్తే మరింత అభివృద్ధి
ఎల్‌బీనగర్‌లో పై వంతెనలు, అండర్‌పాస్ ప్రారంభం కావడంతో ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తీరాయి. ఈ ప్రాంతం నివాసానికి అనుకూలంగా ఉంది. హయత్‌నగర్ అవతల, విజయవాడ జాతీయ రహదారి అవతల ప్రభుత్వం తరుఫున పెద్ద ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. - టి.నరసింహారావు, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, ఈస్ట్‌జోన్ |
ఎక్కడెక్కడంటే
ఇన్నర్ రింగ్‌రోడ్డు చుట్టుపక్కల చదరపు గజం రూ.50వేలకు అటుఇటు ఉంది. కొన్నిచోట్ల ఎక్కువే ఉంటే.. మరికొన్ని చోట్ల కొంత తక్కువగా ఉంది. ఈ ధరకు కొని వ్యక్తిగత ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్నారు. వీటిలో చ.అడుగు రూ.3500 నుంచి ధరలు చెబుతున్నారు.

* మెట్రో, ఇన్నర్‌రింగ్ రోడ్ నుంచి 5-10 కిలోమీటర్ల వరకు ఏడాదిన్నర క్రితం ధరలు అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు అక్కడ చదరపు గజం రూ.25వేల పైనే చెబుతున్నారు. స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మిస్తున్నారు. మేస్త్రీలు కట్టినవాటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఉంటే తప్ప రూ.50లక్షల లోపు దొరకడం లేదు. ఇప్పుడిప్పుడే బహుళ అంతస్తుల నిర్మాణాలు మొదలయ్యాయి. రూ.25-30 లక్షల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు వస్తున్నాయి.
* తూర్పు ప్రాంతంలోనూ అవుటర్ లోపల చ.గజం రూ.10వేల లోపు దొరకడం లేదు. అనుమతి ఉన్న లేఅవుట్లలో ఇంకా ఎక్కువే. దూరం వెళ్లే కొద్దీ రూ.35 లక్షల నుంచి వ్యక్తిగత గృహాలు ఉన్నాయి.
* దీర్ఘకాలానికి పెట్టుబడి దృష్ట్యా బాహ్య వలయ రహదారి బయట కొనుగోలు చేస్తున్నారు. నివాసానికి అవుటర్ లోపలే అనుకూలం.
* ఇన్నర్‌రింగ్ రోడ్డుకు సమీపంలో ఫ్లాట్లు చ.అ.3500 నుంచి రూ.4200 వరకు చెబుతున్నారు. మెట్రోకి చేరువ ఉన్న కాలనీల్లో గరిష్ఠంగా రూ.5వేల పైన చెబుతున్నారు.
* హయత్‌నగర్ చుట్టుపక్కల చ.అ. రూ.2600 శ్రేణిలో ఫ్లాట్లు దొరుకుతున్నాయి.నాగోల్-బండ్లగూడ మార్గంలో బహుళ అంతస్తుల నిర్మాణాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
రవాణా పరంగా సౌలభ్యం
వరంగల్, విజయవాడ, సాగర్ జాతీయ రహదారి కావడంతో రవాణా పరంగా ఏ సమయంలోనైనా గమ్యస్థానం చేరుకోవచ్చన్న భరోసాను తూర్పు ప్రాంతం కల్పిస్తోంది.
వరంగల్, విజయవాడ, సాగర్ జాతీయ రహదారి కావడంతో రవాణా పరంగా ఏ సమయంలోనైనా గమ్యస్థానం చేరుకోవచ్చన్న భరోసాను తూర్పు ప్రాంతం కల్పిస్తోంది.
* జాతీయ రహదారులను కలుపుతూ ఇన్నర్‌రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్‌రోడ్డు అనుసంధానం మెరుగ్గా ఉండటంతో ఈ ప్రాంతం వేగంగా వృద్ధి చెందుతోంది.
DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.
Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.
Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4
Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590
No comments:
Post a Comment