హరితహారంలో భాగంగా అందించేందుకు ఏర్పాట్లు
కేరళ నుంచి విత్తనాలు తెప్పించిన అటవీశాఖ
నర్సరీల్లో 12 లక్షలకు పైగా పెరుగుతున్న గంధపు మొక్కలు

ఈనాడు-హైదరాబాద్: అయిదో విడత హరితహారంలో భాగంగా రైతులకు గంధపు మొక్కలు పంపిణీ చేసేందుకు అటవీశాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా విత్తనాలు తెప్పించింది. సిద్దిపేట జిల్లా ములుగుతోపాటు తెలంగాణ జిల్లాల్లోని పలు నర్సరీల్లో గంధపు మొక్కల పెంపకం చేపట్టింది. వీటిని రైతులకు పంపిణీ చేసి.. వారికి అదనపు రాబడి మార్గంగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఖాళీ స్థలాల్లో పెంపకం
హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నట్లు ఆయాశాఖల గణాంకాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాటిన మొక్కలను తర్వాత పట్టించుకునే పరిస్థితి ఉండటంలేదు. దీనికి తోడు మొక్కలు నాటేందుకు స్థలం కొరత ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి హరితహారంలో కొంత భిన్నంగా వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల పంటపొలాల్లోని అక్కడక్కడా ఖాళీ స్థలాలు, గట్లపై మొక్కలు పెంచడానికి అవకాశం ఉంటుంది. అక్కడ పెంచితే నీటి సమస్య లేకపోవడంతో పాటు వాటి సంరక్షణను రైతులు చూసుకుంటారు. సాధారణ మొక్కలు కాకుండా ఆదాయం వచ్చేవి అయితే ఆసక్తి చూపుతారన్న కారణంతో గంధపు మొక్కలపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఉద్యానవనశాఖతో కలిసి ఆగ్రోఫారెస్ట్రీ కింద గంధం, వెదురుచెట్లను పెంచేందుకు రైతులకు ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఇప్పటికే ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గంధపు చెట్ల పెంపకానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన అటవీ అధికారులు కేరళ వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. దాదాపు 300 కిలోల గంధపు గింజలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ‘‘ములుగు నర్సరీలో 30 కిలోల గింజలు వాడాం. 1.25 లక్షల గంధపు మొక్కలు పెరుగుతున్నాయి’’ అని అటవీ అధికారి ఒకరు తెలిపారు. ఇతర నర్సరీలు కూడా కలిపి కనీసం 12 లక్షల వరకు గంధపు మొక్కలు సిద్ధమవుతున్నాయని అటవీశాఖ వర్గాలు తెలిపాయి.

ఇతర రకాలు సైతం
గంధపు మొక్కలతో పాటు ఎర్రచందనం, వెదురు, సరుగుడు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గంధపు మొక్కల పంపిణీలో చిన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎంత మంది రైతులకు గంధపు మొక్కలు అందించాలి.. ఎన్ని కావాలి అన్నదానికి సంబంధించి అధ్యయనం చేయాలని.. ఏప్రిల్ 15కల్లా ఓ ప్రకటన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రకటనకు రైతుల నుంచి వచ్చే స్పందననుబట్టి అయిదోవిడత హరితహారం ప్రారంభమయ్యాక వారికి ఈ మొక్కలను అందించనున్నట్లు సమాచారం. ఈ మొక్కలు పెంచేవారికి ప్రభుత్వపరంగా ఎలాంటిసహకారం అందించాలన్నదానిపై విధివిధానాలను ఖరారు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

నిబంధనల సడలింపు
రైతులు పెంచే గంధపు మొక్కలు చెట్లుగా పెరిగిన తర్వాత.. వాటిని నరికేందుకు, అమ్ముకునేందుకు నిబంధనల్ని సులభతరం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకుంది.

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.
Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.
Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4
Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590
No comments:
Post a Comment