9849068590 - Temple Town Venture at Yadagiri Gutta

Saturday, 20 April 2019

యాదాద్రిలో ప్రత్యేక విడిది గదులు రూ.104 కోట్ల విరాళాలతో నిర్మాణాలు - Call 9849068590 for DTCP Approved Residential Open Plots at Yadagirigutta

యాదాద్రిలో ప్రత్యేక విడిది గదులు
రూ.104 కోట్ల విరాళాలతో నిర్మాణాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికంగా పరవశమయ్యే తరహాలో కట్టడాలు చేపట్టేందుకు యాడా ప్రత్యేక దృష్టి సారించింది. కొండ కింద దైవసన్నిధి పేరిట దాతల విరాళాలతో రూ.104 కోట్లతో ప్రత్యేక విడిది ఏర్పాట్లను చేపడుతోంది. విశ్వఖ్యాతినొందేలా రూపొందనున్న యాదాద్రిలో అతిముఖ్యులు బసచేసే విడిదిగృహాలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ యోచన. ఆ మేరకు ఆలయానికి ఉత్తర దిశలోని కొండపై ప్రెసిడెన్సియల్‌ సూట్లతోపాటు 14 విల్లాల నిర్మాణానికి పనులు చేపట్టారు. సంప్రదాయానికి అనుగుణంగా అధునాతన వసతులతో విడిది గృహాలు ఏర్పాటవుతాయని ‘యాడా’ అధికారులు చెబుతున్నారు.

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:

Temple Town
Temple Town 1
Temple Town 2
Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

టైటిల్‌తో భూరక్ష ఆధార్‌లా... భూమికో సంఖ్య - Call 9849068590 for DTCP Approved Residential Open Plots


టైటిల్‌తో  భూరక్ష
ఆధార్‌లా... భూమికో సంఖ్య
అవినీతి రహిత సమాజం కోసం ప్రత్యామ్నాయాలను శోధిస్తున్న నిపుణులు
తెరపైకొస్తున్న టైటిల్‌ రిజిస్ట్రేషన్‌
ఇప్పటికే 90 దేశాల్లో అమలు
ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించిన అవినీతి రహిత పాలన కోసం నిపుణులు తగిన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో భూమికి టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ తెరపైకొస్తోంది. దీన్ని ప్రవేశపెడితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పురపాలక శాఖల్లో అవినీతిని చాలా వరకూ అరికట్టవచ్చని బలంగా చెబుతున్నారు. ఈ విధానం ఇప్పటికే 90 దేశాల్లో అమల్లో ఉందని వివరిస్తున్నారు.
టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ మూడు పద్ధతుల్లో ఉంది. మొదటిది మిర్రర్‌ పద్ధతి. అంటే క్షేత్రస్థాయిలో భూముల వివరాలు సేకరించడం, వాటి వాస్తవ యజమానులను గుర్తించడం.
రెండోది కర్టెన్‌ పద్ధతి. ఇందులో ప్రస్తుత భూయజమాని ఎవరన్నది మాత్రమే నమోదు చేస్తారు. అంటే ఆ ప్లాటు లేదా భూమి గత చరిత్ర ఏమీ ఉండదు. మూడోది పరిహార విధానం. ఇది అన్నింటికన్నా కీలకమైంది. భూమి కొన్న వ్యక్తి మోసపోతే ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. భూ క్రయవిక్రయాలప్పుడు ఎలాంటి పొరపాట్లు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నేరుగా నిధులు కేటాయించడం వల్ల కానీ, లేదా బీమా కల్పించడం ద్వారా కానీ ప్రభుత్వం నష్టాన్ని భర్తీ చేయొచ్చు.
అంతా ఒకే గొడుగు కిందకు
భూములు, ఇళ్లు, భవనాల సమాచారం ప్రస్తుతం రెవెన్యూ, సర్వే, భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్‌, మున్సిపాలిటీ లేదా పంచాయతీరాజ్‌ శాఖల దగ్గర వేరువేరుగా ఉంటోది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో ఇదంతా ఒక దగ్గరకే వస్తుంది. ప్రజలు ఒకే పనికోసం విడివిడిగా ఈ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకసారి టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయితే కంప్యూట‌రే మిగిలిన పనులన్నీ చేసేస్తుంది.
ఇది జరగాలంటే ఏం చేయాలి?
మొదట భూములన్నీ సర్వే చేసి యజమానులకు ప్రిలిమినరీ టైటిల్‌ ఇవ్వాలి. అనంతరం అభ్యంతరాల స్వీకరణకు కొంత సమయం ఇవ్వాలి. ఈలోపు సమస్యలు, వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించి తుది టైటిల్‌ ఇవ్వాలి.
ముందు బిల్లు పెట్టాలి
టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ను తెచ్చేందుకు వీలుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, సర్వే, మున్సిపల్‌, స్థానిక సంస్థల చట్టాలను మారుస్తూ అసెంబ్లీలో బిల్లుపెట్టాలి. దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయి చట్టం అమల్లోకి తీసుకురావాలంటే దానికి తగినట్లు అధికారులు, ఉద్యోగులను నియమించాలి. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌లో తప్పులు దొర్లి ప్రజలకు ఏమైనా సమస్యలొస్తే పరిష్కారానికి ట్రైబ్యునల్‌, దానిపై అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లను సైతం ఏర్పాటు చేయాలి.
మన వద్ద పరిస్థితులు ఇలా...
తెలంగాణలో నిజాం నవాబులు ప్రభుత్వ భూములను వదిలేసి, ప్రైవేటు భూములను మాత్రమే సర్వే చేశారు. 1952లో బూర్గుల రామకృష్ణారావు హయాంలో (కాస్రా పహాణీలు) రికార్డులు రాయడం మొదలైంది. ఆ తర్వాత నుంచి అధికారంలోకి వచ్చిన వారు ఎవరికి తోచినట్లు వాళ్లు చేయడంతో రికార్డులన్నీ తారుమారయ్యాయి. రికార్డులు సరిగ్గా లేకపోవడం, భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు పెరిగిపోవడంతో ఇప్పటి వరకు టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ వైపు ఏ ప్రభుత్వమూ అడుగువేయలేదు. ఈ చిక్కులను ధరణి వెబ్‌సైట్‌ కొంత మేర తొలగించింది. 70 శాతం వ్యవసాయ భూములకు యజమానులు ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చింది. కానీ సర్వే రికార్డు లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నిజామాబాద్‌లో భూభారతి నయం
2004-14 మధ్య కాంగ్రెస్‌ హయాంలో భూభారతి పథకం కింద పాత నిజామాబాద్‌ జిల్లాలో 90 శాతం వ్యవసాయ భూములను ఉపగ్రహాల ద్వారా చిత్రీకరించి ఎవరికి ఎంత భూమి ఉందనేది గుర్తించారు. అలాగే వ్యవసాయేతర భూముల లెక్కలు మూడేళ్లలో తేల్చవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అంటే..
ప్రతి మనిషికి ఆధార్‌ సంఖ్యను ఇచ్చినట్లుగానే ప్రతి భూమి లేదా ప్లాటుకి ఒక యూనిక్‌ ఐడీ సంఖ్య(కోడ్‌) ఇస్తారు. సెంటు, గుంట, ఎకరా ఇలా ఎవరికి ఎంత భూమి ఉన్నాసరే యజమాని పేరుమీద ఈ ఐడీ ఇస్తారు. అది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే చాలు... సంబంధిత సర్వే నెంబరులో ఎంత భూమి ఉంది.. ఎవరి పేరుమీద ఉందనే విషయాలు తెలిసిపోతాయి. కొత్త వ్యక్తి ఆ భూమిని కొంటే ఆ ఐడీ నెంబరుతోనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఆ నెంబరుతో గతంలో ఎవరు కొన్నారనే వివరాలన్నీ ఉంటాయి. దీన్నే టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అని పిలుస్తారు.
ఇప్పుడున్నంతమంది సిబ్బంది అవసరం ఉండదు
ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా భూములు, ప్లాట్లన్నింటికీ టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తయి అన్నింటికీ యూనిక్‌ ఐడీ కేటాయిస్తే రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో ఇప్పుడున్నంత మంది సిబ్బంది అవసరముండదు. మ్యూటేషన్‌ కోసం, పేరు మార్పు కోసం తహసీల్దార్‌, పురపాలక, పంచాయతీ కార్యాలయాలకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ పూర్తయితే కంప్యూటరే ఈ పనులన్నీ చేస్తుంది. ఇప్పుడు ఆ పనులకు ఆయా కార్యాలయాలకు వెళ్లడం వల్ల లంచాలు ఇవ్వాల్సి వస్తోంది.
తక్కువలో తక్కువ పదేళ్ల సమయం కావాలి
మొదటి టైటిల్‌ను 1862లో ఆస్ట్రేలియాలో ఇచ్చారు. అనంతరం ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, అమెరికాల్లోనూ వాడుకలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ను తీసుకురావాలంటే పదేళ్ల సమయం పడుతుందనేది నిపుణుల అంచనా. ఇంగ్లాండ్‌లో 160 ఏళ్ల సమయం పట్టిందని, ఆస్ట్రేలియాలో 15 సంవత్సరాల్లో పూర్తయ్యిందని.. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో మనదగ్గర పదేళ్లలో ప్రక్రియను పూర్తి చేయొచ్చని ఓ ఐఏఎస్‌ అధికారి చెప్పారు. థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌ల్లో మాదిరిగా ఉపగ్రహాలతో సర్వే చేస్తే పని మరింత సులువవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం డీఐఎల్‌(డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ ప్రోగ్రాం) కింద నిధులివ్వడానికి సిద్ధంగా ఉందని వివరిస్తున్నారు.

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

Thursday, 18 April 2019

భూముల ధరలు పెరిగినా.. తగ్గని దూకుడు - Call 9849068590 for DTCP Approved Open Plots at Yadagirigutta


భూములు, స్థలాల ధరలు ఏడాదికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెట్టింపయ్యాయి. మార్కెట్‌ వర్గాలు సైతం ఊహించని విధంగా పెరిగాయి. అయినా అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారీగా వృద్ధి నమోదవడం చూస్తుంటే మార్కెట్‌ ఎక్కడా ఆగేలా సంకేతాలు కనబడటం లేదు. పెట్టుబడి కోసం స్థలాలు, సొంతింటి కోసం ఇల్లు తీసుకునేవారు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో తీసుకోవడం మేలని.. కొత్తగా ప్రారంభించే వాటిలో ధరలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
స్థిరాస్తి మార్కెట్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, యాదాద్రి చుట్టుపక్కలనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికాలంగా దూకుడు కనబడింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం, వరసగా ఐదో ఏడాది మెర్సర్‌ సంస్థ రేటింగ్‌లో నగరానికి దేశంలోనే మొదటి స్థానం దక్కడంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమలు రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టడం, ఇప్పటికే పలు పరిశ్రమలు వేలకోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై అంచనాలతో అక్కడ స్థిరాస్తి వ్యాపారం కూడా జోరందుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన మొదలు ఆయా జిల్లాల్లో కొత్తగా చేపడుతున్న ప్రాజెక్ట్‌లు రియల్‌రంగానికి ఊతమిస్తున్నాయి. పాతికశాతం పైగా పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఇందుకు నిదర్శనం. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.5177 కోట్ల నుంచి రూ.6612.75 కోట్లకు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో మార్చిలోనే 12 శాతం నమోదవడం మార్కెట్‌ సెంటిమెంట్‌కు బలం చేకూరుస్తోంది.
లుక్‌ఈస్ట్‌ పాలసీలో ఉప్పల్‌ మార్గంలోనూ సానుకూలత ఏర్పడింది. నగరానికి ధీటుగా జిల్లాల్లోనూ రియల్‌ పరుగులు పెడుతోంది. యాదగిరిగుట్ట క్షేత్రం అభివృద్ధికి సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టడం, వరంగల్‌-హైదరాబాద్‌ను పారిశ్రామ కారిడార్‌గా చేస్తుండటంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటయ్యాయి. కొత్తవి భారీగా పుట్టుకొస్తున్నాయి. పెట్టుబడి దృష్ట్యా ఎక్కువ మంది ఇక్కడ కొనుగోళ్లకు ఆసక్తిచూపిస్తున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ల ఆదాయం దండిగా వచ్చింది.
నలువైపులా..
రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మాణాలు పెరిగాయి. ఓఆర్‌ఆర్‌ బయట స్థలాల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఔషధ నగరి, ప్రాంతీయ వలయ రహదారి ప్రణాళికలు మార్కెట్‌ను సానుకూల దిశగా తీసుకెళుతున్నాయని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి. నగరంలోనూ నిర్మాణాల పరంగా వేగం పెరగింది. దక్షిణం వైపు వృద్ధి నమోదు చేసింది. బుద్వేల్‌ ప్రాంతంలో ఐటీ టవర్లు వస్తాయని ప్రకటించడంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. అయినా జోరు ఆగలేదు. ఇందుకు తగ్గట్టుగానే డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నారు. 

హైదరాబాద్‌ పశ్చిమం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్టులో ఇటీవల పలు సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. కొత్తగా వచ్చేవారు ఇక్కడే కావాలంటున్నారు. ఐటీ సంస్థలన్నీ ఇక్కడ కేంద్రీకృతం అయి ఉండటంతో పెద్ద సంస్థలు తమ ప్రీమియం ప్రాజెక్ట్‌లను ఇక్కడే చేపట్టాయి. ఇప్పటికీ ఇక్కడ చేపట్టే ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ అధికంగా ఉంది. ప్రకటించేదే ఆలస్యం హాట్‌ కేకుల్లా బుకింగ్‌ అవుతున్నాయి. హైటెక్‌సిటీ వరకు మెట్రో రావడంతో చుట్టు పక్కల దూరంగానైనా కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. 

ఎల్‌బీనగర్‌ వైపు మౌలిక ప్రాజెక్ట్‌లు ప్రకటించాలని నిర్మాణ రంగం కోరుతోంది. ఈ చుట్టుపక్కల పెద్ద ప్రాజెక్ట్‌లేవీ లేకపోవడం కొంత లోటుగా ఉంది. అయినా వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం, స్థలాల కొనుగోళ్లలో ఎక్కడా వెనుకబడలేదు. 

సంగారెడ్డిలో చాలా ప్రాంతాలు నగరంలో భాగమే. ఇక్కడ లేఅవుట్లు భారీగా వెలిశాయి. జాతీయ రహదారి, ఐటీ కారిడార్‌కు చేరువ, ఓఆర్‌ఆర్‌ అనుసంధానం, ఐఐటీ, ఇతర విద్యాసంస్థలు ఉండటంతో క్రమంగా నివాసయోగ్య ప్రాంతంగా విస్తరిస్తుంది. 

నగర శివార్లలో 50 ఎకరాల విస్తీర్ణంలో మినీ నగరాలను నిర్మించేలా టౌన్‌షిప్‌ పాలసీని సర్కారు ప్రకటించింది. ఇక్కడే చుట్టుపక్కల పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్‌, వినోద కేంద్రాలు ఉండేలా చూస్తున్నారు. వీటిని చేపట్టే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. రాబోయే రోజుల్లో బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) చేరువలో కొత్త ప్రాజెక్ట్‌లను పలు సంస్థలు ప్రకటించబోతున్నాయి.

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590


Friday, 12 April 2019

తూర్పున రియల్‌ పరుగు - ఈనాడు, హైదరాబాద్‌ Call 9849068590 for DTCP Approved Open Plots at Yadagirigutta

హైదరాబాద్‌ తూర్పున స్థిరాస్తి జోరందుకుంది. పశ్చిమ మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. పెట్టుబడిదారులు ‘లుక్‌ఈస్ట్‌’ అంటున్నారు. ఇటీవల ఉప్పల్‌ భగాయత్‌ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని ప్లాట్లకు వేలం వేయగా సగటున చదరపు గజం రూ.50వేలపైనే పలికింది. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి వాసుల్లో గుబులు రేపినా.. మార్కెట్‌ పోకడకు అద్దం పట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపు పడింది. 

హైదరాబాద్‌ తూర్పు ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. సామాన్య, మధ్యతరగతి వాసులకు సొంతింటి కల నెరవేర్చుకునే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ధరలు బాగా పెరిగినా.. ఈ కేంద్రాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. స్థోమతను బట్టి వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేయవచ్చు. మున్ముందు మరింత పెరుగుతాయే తప్ప స్థిరాస్తి ధరలు తగ్గే అవకాశం లేదని రియల్టర్లు అంటున్నారు.
మెట్రోతో మరింత ఊపు
ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ వరకు మెట్రో రైలు సదుపాయం ఉండటంతో ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే సౌలభ్యం ఏర్పడింది. హైటెక్‌సిటీ, మియాపూర్‌ ఎక్కడికైనా ఇక్కట్లు లేకుండా వెళ్లొచ్చు. చివరి మెట్రో స్టేషన్ల నుంచి 20 కి.మీ. వరకు స్థిరాస్తి మార్కెట్‌ విస్తరించింది.
సికింద్రాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ప్రతిపాదిత ఎంఎంటీఎస్‌తో రవాణా మరింత సౌలభ్యం కానుంది. యాదాద్రి అభివృద్ధితోనూ ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా రాబోయే రోజుల్లో ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది. 

పోచారంలో ఐటీ కంపెనీలు ఇప్పటికే ఉండటం.. కొత్త సంస్థలు వస్తుండటంతో మరింత వృద్ధికి ఆస్కారం ఉంది. 

ట్రాఫిక్‌ సమస్యలు తీర్చేందుకు ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఎక్స్‌ప్రెస్‌ వే పనులు చేపట్టారు. 

ఎల్‌బీనగర్‌లో పై వంతెన, అండర్‌పాస్‌ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య పూర్తిగా తీరనుంది. ఇన్నాళ్లు ఈ ప్రాంత అభివృద్ధికి ట్రాఫిక్‌ పెద్ద సమస్యగా ఉండేది. రాబోయే రోజుల్లో చుట్టుపక్కల పెద్ద సంస్థలు నిర్మాణాలు చేపట్టేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. 

సాగర్‌ రహదారిలో ఆదిభట్లలో ఐటీ, ఏరో సెజ్‌తో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. 

వీటన్నింటితో ప్రస్తుతం ఈ ప్రాంతం నివాసాలకు అనుకూలంగా మారింది. భవిష్యత్తు వృద్ధికి అవకాశంగా ఉన్న మార్గంగా నిర్మాణదారులు చెబుతున్నారు.

పెద్ద ప్రాజెక్ట్‌లు వస్తే మరింత అభివృద్ధి 
- టి.నరసింహారావు, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌, ఈస్ట్‌జోన్‌
ఎల్‌బీనగర్‌లో పై వంతెనలు, అండర్‌పాస్‌ ప్రారంభం కావడంతో ట్రాఫిక్‌ సమస్యలు చాలావరకు తీరాయి. ఈ ప్రాంతం నివాసానికి అనుకూలంగా ఉంది. హయత్‌నగర్‌ అవతల, విజయవాడ జాతీయ రహదారి అవతల ప్రభుత్వం తరుఫున పెద్ద ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. 

ఎక్కడెక్కడంటే
ఇన్నర్‌ రింగ్‌రోడ్డు చుట్టుపక్కల చదరపు గజం రూ.50వేలకు అటుఇటు ఉంది. కొన్నిచోట్ల ఎక్కువే ఉంటే.. మరికొన్ని చోట్ల కొంత తక్కువగా ఉంది. ఈ ధరకు కొని వ్యక్తిగత ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్నారు. వీటిలో చ.అడుగు రూ.3500 నుంచి ధరలు చెబుతున్నారు. 

మెట్రో, ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ నుంచి 5-10 కిలోమీటర్ల వరకు ఏడాదిన్నర క్రితం ధరలు అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు అక్కడ చదరపు గజం రూ.25వేల పైనే చెబుతున్నారు.  స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మిస్తున్నారు. మేస్త్రీలు కట్టినవాటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఉంటే తప్ప రూ.50లక్షల లోపు దొరకడం లేదు.  ఇప్పుడిప్పుడే బహుళ అంతస్తుల నిర్మాణాలు మొదలయ్యాయి. రూ.25-30 లక్షల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు వస్తున్నాయి. 

తూర్పు ప్రాంతంలోనూ అవుటర్‌ లోపల చ.గజం రూ.10వేల లోపు దొరకడం లేదు. అనుమతి ఉన్న లేఅవుట్లలో ఇంకా ఎక్కువే. దూరం వెళ్లే కొద్దీ రూ.35 లక్షల నుంచి వ్యక్తిగత గృహాలు ఉన్నాయి. 

దీర్ఘకాలానికి పెట్టుబడి దృష్ట్యా బాహ్య వలయ రహదారి బయట  కొనుగోలు చేస్తున్నారు. నివాసానికి అవుటర్‌ లోపలే అనుకూలం. 

ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఫ్లాట్లు చ.అ.3500 నుంచి రూ.4200 వరకు చెబుతున్నారు. మెట్రోకి చేరువ ఉన్న కాలనీల్లో గరిష్ఠంగా రూ.5వేల పైన చెబుతున్నారు. 

హయత్‌నగర్‌ చుట్టుపక్కల చ.అ. రూ.2600 శ్రేణిలో ఫ్లాట్లు దొరుకుతున్నాయి.నాగోల్‌-బండ్లగూడ మార్గంలో బహుళ అంతస్తుల నిర్మాణాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
రవాణా పరంగా సౌలభ్యం
వరంగల్‌, విజయవాడ, సాగర్‌ జాతీయ రహదారి కావడంతో రవాణా పరంగా ఏ సమయంలోనైనా గమ్యస్థానం చేరుకోవచ్చన్న భరోసాను తూర్పు ప్రాంతం కల్పిస్తోంది. 

జాతీయ రహదారులను కలుపుతూ ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌రోడ్డు అనుసంధానం మెరుగ్గా ఉండటంతో ఈ ప్రాంతం వేగంగా వృద్ధి చెందుతోంది.
DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590



Monday, 8 April 2019

రైతులకు గంధపు మొక్కల పంపిణీ - 9849068590

రైతులకు గంధపు మొక్కల పంపిణీ
హరితహారంలో భాగంగా అందించేందుకు ఏర్పాట్లు
కేరళ నుంచి విత్తనాలు తెప్పించిన అటవీశాఖ
నర్సరీల్లో 12 లక్షలకు పైగా పెరుగుతున్న గంధపు మొక్కలు
ఈనాడు-హైదరాబాద్‌: అయిదో విడత హరితహారంలో భాగంగా రైతులకు గంధపు మొక్కలు పంపిణీ చేసేందుకు అటవీశాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా విత్తనాలు తెప్పించింది. సిద్దిపేట జిల్లా ములుగుతోపాటు తెలంగాణ జిల్లాల్లోని పలు నర్సరీల్లో గంధపు మొక్కల పెంపకం చేపట్టింది. వీటిని రైతులకు పంపిణీ చేసి.. వారికి అదనపు రాబడి మార్గంగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఖాళీ స్థలాల్లో పెంపకం
హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నట్లు ఆయాశాఖల గణాంకాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాటిన మొక్కలను తర్వాత పట్టించుకునే పరిస్థితి ఉండటంలేదు. దీనికి తోడు మొక్కలు నాటేందుకు స్థలం కొరత ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి హరితహారంలో కొంత భిన్నంగా వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల పంటపొలాల్లోని అక్కడక్కడా ఖాళీ స్థలాలు, గట్లపై మొక్కలు పెంచడానికి అవకాశం ఉంటుంది. అక్కడ పెంచితే నీటి సమస్య లేకపోవడంతో పాటు వాటి సంరక్షణను రైతులు చూసుకుంటారు. సాధారణ మొక్కలు కాకుండా ఆదాయం వచ్చేవి అయితే ఆసక్తి చూపుతారన్న కారణంతో గంధపు మొక్కలపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ఉద్యానవనశాఖతో కలిసి ఆగ్రోఫారెస్ట్రీ కింద గంధం, వెదురుచెట్లను పెంచేందుకు రైతులకు ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఇప్పటికే ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గంధపు చెట్ల పెంపకానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన అటవీ అధికారులు కేరళ వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. దాదాపు 300 కిలోల గంధపు గింజలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ‘‘ములుగు నర్సరీలో 30 కిలోల గింజలు వాడాం. 1.25 లక్షల గంధపు మొక్కలు పెరుగుతున్నాయి’’ అని అటవీ అధికారి ఒకరు తెలిపారు. ఇతర నర్సరీలు కూడా కలిపి కనీసం 12 లక్షల వరకు గంధపు మొక్కలు సిద్ధమవుతున్నాయని అటవీశాఖ వర్గాలు తెలిపాయి.
ఇతర రకాలు సైతం
గంధపు మొక్కలతో పాటు ఎర్రచందనం, వెదురు, సరుగుడు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గంధపు మొక్కల పంపిణీలో చిన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎంత మంది రైతులకు గంధపు మొక్కలు అందించాలి.. ఎన్ని కావాలి అన్నదానికి సంబంధించి అధ్యయనం చేయాలని.. ఏప్రిల్‌ 15కల్లా ఓ ప్రకటన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రకటనకు రైతుల నుంచి వచ్చే స్పందననుబట్టి అయిదోవిడత హరితహారం ప్రారంభమయ్యాక వారికి ఈ మొక్కలను అందించనున్నట్లు సమాచారం. ఈ మొక్కలు పెంచేవారికి ప్రభుత్వపరంగా ఎలాంటిసహకారం అందించాలన్నదానిపై విధివిధానాలను ఖరారు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
నిబంధనల సడలింపు
రైతులు పెంచే గంధపు మొక్కలు చెట్లుగా పెరిగిన తర్వాత.. వాటిని నరికేందుకు, అమ్ముకునేందుకు నిబంధనల్ని సులభతరం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకుంది.

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590



Thursday, 4 April 2019

హైదరాబాద్ లో ఇండ్లు చౌక: Property Consultant JLL India



DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590