హెచ్‌ఎండీఏకు రిజిస్ట్రేషన్ల శాఖ ఝలక్
అక్రమ లేఅవుట్లపై స్పందన శూన్యం
లేఖలు రాసినా యథావిధిగా రిజిస్ట్రేషన్లు
ఈనాడు, హైదరాబాద్
అక్రమ లేఅవుట్లపై స్పందన శూన్యం
లేఖలు రాసినా యథావిధిగా రిజిస్ట్రేషన్లు
ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు ఝలక్ ఇస్తున్నారు. అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా అసలు లెక్క చేయడం లేదు. యథావిధిగా రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు. హెచ్‌ఎండీఏ లేఖలు రాయడం.. రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు పట్టించుకోకపోవడం ఓ తంతుగా మారింది.
కారు పంపించమంటారా..!
ఒకవైపు ఆదాయానికి గండి పడుతోంది. మరోవైపు అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి అమాయకులు నట్టేటా మునుగుతున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతులు పొందాలంటే నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఓపెన్ స్పేస్, పార్కులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్తు తదితర సౌకర్యాలను కల్పించాలి. ఇదంతా చేస్తే మాకేం మిగులుతుందంటూ కొందరు స్థిరాస్తి వ్యాపారులు రాత్రికి రాత్రే వ్యవసాయ పొలాలను చదును చేసి గ్రామ పంచాయతీల అనుమతి ప్లాట్లుగా విభజించి అమ్మేస్తున్నారు. లేఅవుట్లకు అనుమతులిచ్చే అధికారులు హెచ్‌ఎండీఏకు మాత్రమే ఉంది. కొందరేమో అమాయకులకు అరచేతిలో స్వర్గం చూపించేందుకు తారు రోడ్లు, విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేసి అంటగడుతున్నారు. మరికొందరేమో ఓ అడుగు ముందుకేసి హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం లేఅవుట్‌ను అభివృద్ధి చేశామంటూ రంగు రంగుల కరపత్రాలు ముద్రించి అరచేతిలోనే స్వర్గం చూపిస్తున్నారు. లేఅవుట్ చూపించేందుకు ప్రత్యేకంగా ఇంటికి కారు పంపిస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువకే వస్తుందంటూ అంటగడుతున్నారు. తీరా చూస్తేనేమో.. ఆ లేఅవుట్ ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్, బఫర్ జోన్, గ్రీనరీ జోన్ తదితర వాటిలో ఉండటంతో ఎల్‌ఆర్‌ఎస్ కూడా కావడం లేదు. ఇళ్లు కట్టుకునేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయకపోవడంతో లబోదిబోమంటున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్, అనుమతి లేదు కదా..!
అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజస్ట్రేషన్ చేయొద్దని ఆ శాఖకు హెచ్‌ఎండీఏ అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని నెల రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ఇలాంటి లేఖలు చాలా రాశారు. ఇదే మొదటి లేఖ అనుకుంటే పొరపడినట్లే. హెచ్‌ఎండీఏ ఎప్పటి నుంచో లేఖలు రాస్తోంది. అయినా సరే.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా.. ఈ లేఖలు కొందరు రిజిస్ట్రేషన్ల శాఖాధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ‘ఎల్‌ఆర్‌ఎస్ లేదు కదా.. అనుమతుల్లేని లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రత్యేకంగా హెచ్‌ఎండీఏ లేఖ రాసింది. అడిగినంత ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేస్తా’ అంటూ కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపారులతో బేరసారాలకు దిగుతున్నారు. శంషాబాద్, కీసర, మేడ్చల్, శామీర్‌పేట్, ఘట్‌కేసర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, ఉప్పల్, రాజేంద్రనగర్, కందుకూరు, యాచారం, షాద్‌నగర్, కొత్తూరు తదితర ప్రాంతాల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కనీసం హెచ్‌ఎండీఏ రాసిన లేఖలకు కూడా సమాధానమిచ్చే తీరిక రిజిస్ట్రేషన్ల శాఖాధికారులకు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖకు హెచ్‌ఎండీ కమిషనర్‌గా ఉన్నప్పుడు చిరంజీవులు పలు లేఖలు రాశారు. ఇప్పుడు ఆయనే రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా ఉండటం గమనార్హం.

అక్కడే ఆపేస్తే అడ్డుకోవచ్చు..!
అటు గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పడం లేదు. ఇటు క్షేత్రస్థాయిలో ఉండే హెచ్‌ఎండీఏ అధికారులు అక్రమ లేఅవుట్లవైపు చూడటం లేదు. ఈ ఇద్దరు కుమ్మక్కై అందిన కాడికి దండుకుని పరోక్షంగా సంబంధిత స్థిరాస్తి వ్యాపారులకు సహకరిస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అనధికార లేఅవుట్లలో కూల్చివేతలు చేపట్టినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. రెండు, మూడు రోజుల తర్వాత రంగంలోకి దిగుతున్నారు. కూల్చివేసిన నిర్మాణాలను పునర్ నిర్మించి విక్రయాలు షురూ చేస్తున్నారు. ఈ తరుణంలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు అక్రమ లేఅవుట్లను అడ్డుకునేందుకు ఏం చేయాలనే విషయంపై తీవ్ర కసరత్తు చేశారు. ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకోగలిగితే కొంత వరకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. రిజిస్ట్రేషన్ శాఖాధికారులు ఆ సమాచారాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.
Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.
Following Ventures are available:
Temple Town
Temple Town 1
Temple Town 2
Temple Town 4
Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

No comments:
Post a Comment