9849068590 - Temple Town Venture at Yadagiri Gutta

Tuesday, 5 March 2019

మొత్తం ఫ్లాటు విలువపై పన్ను కట్టాలి - Bhuvaneshwari Properties - Temple Town Ventures - 9849068590

నిర్మాణ దశలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇండిపెండెంట్‌ హౌస్‌కు జీఎస్‌టీ ఎంత? వినియోగదారు బ్యాంక్‌ ఖాతా నుంచి పన్ను విభాగానికి జీఎస్‌టీ చెల్లించాలా లేకపోతే నిర్మాణదారు బ్యాంకు ఖాతా నుంచి చెల్లించాలా?
- రెడ్డి సత్యనారాయణ
ప్రస్తుతానికి నిర్మాణంలో ఉన్న స్థిరాస్తులపై జీఎస్‌టీ 12 శాతంగా ఉంది. అయితే జీఎస్‌టీ మండలి సిఫారసు మేరకు అందుబాటు ధరలో లేని గృహాలపై 5%; అందుబాటు ధర గృహాలపై 1% చొప్పున రేటు విధించారు. ఈ కొత్త రేట్లు ఏప్రిల్‌ 1, 2019 నుంచి అమల్లోకి వస్తాయి. నిర్మాణంలో ఉన్న స్థిరాస్తిను కొనుగోలు చేసేటపుడు బిల్డరుకు జీఎస్‌టీ మొత్తాన్ని కట్టాలి. జీఎస్‌టీ చట్టంలో ఎవరి ఖాతా నుంచి చెల్లించాలన్న విషయాన్ని చర్చించలేదు.
సెప్టెంబరు 2017న పాక్షికంగా పూర్తయిన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాను. వ్యాట్‌ కట్టాను. అక్టోబరు 2018న ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాన్ని పొందాను. ఇపుడు బిల్డరు సేవా పన్ను అడుగుతున్నారు. నేను సేవా పన్ను కట్టాలా లేదా వ్యాట్‌ మొత్తాన్ని తగ్గించుకుని జీఎస్‌టీని మళ్లీ కట్టాలా?
- మోనిక దీప్తి
జీఎస్‌టీకి ముందు నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లపై వ్యాట్‌, సేవా పన్ను అమల్లో ఉంది. మీ విషయంలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక కొనుగోలు జరిగింది కాబట్టి కేవలం జీఎస్‌టీ మాత్రమే వర్తిస్తుంది. బిల్డరు ఎందుకు వ్యాట్‌ వసూలు చేశారో మీరు చెప్పలేదు. అయినప్పటికీ.. జీఎస్‌టీకి మారే సమయంలో వ్యాట్‌, సేవా పన్ను లేదా జీఎస్‌టీలలో ఏది కట్టాలన్నది బిల్డరు ఇష్టమే. మీ విషయంలో బిల్డరు వ్యాట్‌, సేవా పన్నును ఎంచుకున్నట్లున్నారు. కాబట్టి బిల్డరు చెప్పినట్లుగా సేవా పన్ను కట్టాలి. వ్యాట్‌, సేవా పన్ను, జీఎస్‌టీ అనేవి పరోక్ష పన్నులు కాబట్టి భవిష్యత్‌లో పన్ను విభాగం మిమ్మల్ని ఎంత మాత్రం బాధ్యత వహించేలా చేయదు. కేవలం బిల్డరుదే బాధ్యత.
ఒక బిల్డింగ్‌పై మాకు వర్క్స్‌ కాంట్రాక్టు వచ్చింది. అయితే దానిపై జీఎస్‌టీ కట్టాలి కానీ ఐటీసీని క్లెయిము చేసుకోవడానికి వీల్లేదని..ఎందుకంటే అది స్థిరాస్తి అని అంటున్నారు. ఐటీసీని క్లెయిము చేసుకునే దారి ఉందా?
- నిఖిల్‌ ఎస్‌
ఒక వేళ తదుపరి వర్క్స్‌ కాంట్రాక్టు మీరు సరఫరా చేయకపోతే మీకు చెప్పింది నిజమే. ఐటీసీ క్లెయిముకు వీల్లేదు. ఒక వేళ మీరు మీ వినియోగదారుకు వర్క్స్‌ కాంట్రాక్టు సేవలను అందిస్తే మీకు ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌కు అర్హత ఉంటుంది.
మాది ఎరువుల, పురుగుమందుల వ్యాపారం. మాకు వ్యాట్‌ రిజిస్ట్రేషన్‌ ఉంది. మే 2017న కొంత సరుకు కొనుగోలు చేశాం. వ్యాట్‌, ఎక్సైజ్‌ సుంకాన్ని ఆ కొనుగోలు బిల్లులో వేశారు. జీఎస్‌టీ వచ్చాక ట్రాన్‌-1 ఫైల్‌ చేశాం. అందులో వ్యాట్‌ ఐటీసీ మాత్రమే క్లెయిము చేశాం. ఎక్సైజ్‌ సుంకాన్ని క్లెయిము చేయలేదు. అది పెద్ద మొత్తంలో ఉంది. ఇపుడు క్లెయిము చేసుకోవడానికి వీలుందా?
- సీహెచ్‌ వి.వి. సత్యనారాయణ
నమోదిత వ్యక్తికి ట్రాన్‌-1 దరఖాస్తును ఫైల్‌ చేయడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. చాలా సార్లు గడువును పొడిగించింది కూడా. చివరగా ఈ గడువును మార్చి 31, 2019 వరకు ఇటీవలే పొడిగించింది. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మీ దరఖాస్తును సమర్పించుకోండి.
ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ చట్టాలు రెండు విడివిడిగా ఎందుకు. వీటి వల్ల వినియోగదారుడికి కానీ.. వర్తకునికి కానీ ప్రయోజనాలున్నాయా? సీబీఐసీ, రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా సర్క్యులర్లు జారీ చేస్తున్నారు కదా.. వీటిలో వేటిని అనుసరించాలి.
- పెతకం శెట్టి శివ శ్రీనివాస్‌, విశాఖపట్నం
భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సార్వభౌమాధికారాలున్నాయి. అందువల్లే సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ విడివిడిగా అమలు చేస్తున్నారు. సీబీఐసీ జారీ చేసే నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, ఆదేశాలు మొత్తం భారత్‌కు వర్తిస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసేవన్నీ సదరు రాష్ట్రానికి వర్తిస్తాయి. అదే సమయంలో సీబీఐసీ జారీచేసినవన్నీ కూడా సదరు రాష్ట్రంలో పాటించాల్సి ఉంటుంది.
డిస్ట్రిబ్యూటర్‌గా కొత్త జీఎస్‌టీ నమోదుకు దరఖాస్తు చేసుకున్నాను. మొత్తం ప్రక్రియను అనుసరించాను. అయితే స్టేటస్‌లో ఉన్నది నాకు అర్థం కావడం లేదు.
- అశోక్‌ కుమార్‌ మల్లిపెద్ది
మీరు పంపిన స్టేటస్‌ ప్రకారం.. మీ దరఖాస్తు సరిగ్గా ఉంది. దానిని అధికార్లు ప్రాసెస్‌ చేస్తున్నారు. కొద్ది పనిదినాల్లో మీ జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ అవుతుంది.
9(3), 9(4)పై ఆర్‌సీఎమ్‌ మీద స్పష్టత ఇవ్వండి. ఈ విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. 01/02/2019 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లేనా? కొన్ని నోటీసుల్లో ఆర్‌సీఎమ్‌ను ప్రజా ప్రయోజనాల కోసం రద్దు చేశారని.. మరి కొంతమందేమో ఆర్‌సీఎమ్‌ను తిరిగి ప్రవేశపెట్టారని అంటున్నారు?
- ఎస్‌. అమరనాథ రెడ్డి
జీఎస్‌టీలో రెండు రివర్స్‌ ఛార్జీలు ఉన్నాయి. సెక్షన్‌ 9(3) కింద ఒకటి.  సెక్షన్‌ 9(4) కింద మరొకటి. 9(3) కింద వర్తించే రివర్స్‌ ఛార్జీని ‘స్పెసిఫైడ్‌ రివర్స్‌ ఛార్జ్‌’ అంటున్నారు. ఇది 01.07.2017 నుంచీ కొనసాగుతోంది. ఎటువంటి మార్పులు లేవు. ఇక సెక్షన్‌ 9(4) కింద రివర్స్‌ ఛార్జీని ‘అన్‌రిజిస్టర్డ్‌ రివర్స్‌ ఛార్జ్‌’గా పరిగణిస్తున్నారు. ఇది 01.07.2017 నుంచి 12.10.2017 వరకు అమల్లో ఉండేది. 31.01.2019 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. ఇటీవల ఆ సెక్షన్‌ను సవరించి 01.02.2019 నుంచి వర్తించేలా చేశారు. సవరణ చేశారు కానీ ఎటువంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. నోటిఫికేషన్‌ వచ్చేంత వరకు సెక్షన్‌ 9(4) ఇంకా అమల్లోకి రానట్లే లెక్క.
ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత నవంబరు 2018న ఒక ఫ్లాట్‌ కొన్నాను. జీఎస్‌టీని చెల్లించాలా? బిల్డర్‌ సేవా పన్ను కట్టాలని అంటున్నారు? ఏం చేయాలి?
- మధు ఎమ్‌ ఎస్‌ రావు
ఆక్యుపెన్సీ పత్రానికి ముందు మీరు బిల్డరుకు ఏదైనా అడ్వాన్సు రూపంలో చెల్లించి ఉంటే మొత్తం ఫ్లాట్‌ విలువపై జీఎస్‌టీ వర్తిస్తుంది. ఆక్యుపెన్సీ పత్రం వచ్చాక ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఉండి; ఆక్యుపెన్సీ పత్రానికి ముందు ఎటువంటి అడ్వాన్సు చెల్లించనట్లయితే జీఎస్‌టీ వర్తించదు.
మాకు భాగస్వామ్య వ్యాపారాలున్నాయి. భాగస్వామి శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)పై జీఎస్‌టీ సంఖ్య ఇచ్చారు. దానిని కంపెనీ పాన్‌కు ఎలా మార్చాలి?
- కోవూరు హరినాథ్‌
దరఖాస్తు ఏ పాన్‌ నంబరుపై సమర్పిస్తున్నారన్నది మీరు చెప్పలేదు. ఒక వేళ కంపెనీ పాన్‌పై సమర్పించి ఉంటే.. పాన్‌ మార్పునకు సదరు విభాగాన్ని కోరవచ్చు. ఎందుకంటే అది వారి పొరబాటు కాబట్టి. ఒక వేళ మీరు మీ భాగస్వామి పాన్‌పై పొరబాటును దరఖాస్తు చేసి ఉంటే.. రిజిస్ట్రేషన్‌ రద్దుకు దరఖాస్తు చేసి తాజాగా కంపెనీ పాన్‌పై రిజిస్ట్రేషన్‌ను సరిగ్గా చేసుకోండి.
నిర్మాణంలో ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీలో ఫ్లాటు తీసుకోవాలనుకుంటున్నాను. దాని బేసిక్‌ ధర రూ.62 లక్షలు. కానీ ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ధర సుమారు రూ.29 లక్షలు. నేను ఏ ధరపై 12 శాతం జీఎస్‌టీ కట్టాలి. ఎంత చెల్లించాలి. ఇపుడు జీఎస్‌టీ 5 శాతమే అంటున్నారు. ఏది నిజం? ఫ్లాటు 2020 ఆగస్టులో పూర్తి అవుతుంది. జీఎస్‌టీ ముందే కట్టాలా లేదా రిజిస్ట్రేషన్‌ సమయంలో కడితే సరిపోతుందా?
- రాజేశ్‌ కుమార్‌, విజయవాడ

మొత్తం ఫ్లాటు విలువపై(రూ.62 లక్షలు) జీఎస్‌టీ కట్టాలి. 31.03.2019 వరకు నిర్మాణంలో ఉన్న భవనాలపై 12 శాతం జీఎస్‌టీ అమలవుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి దానిని 5 శాతానికి ప్రభుత్వం తీసుకురానుంది. ఒప్పందం ప్రకారం.. మొత్తం విలువపై జీఎస్‌టీ కట్టాలి. ఎప్పుడు కట్టాలన్నది ఒక్కో కేసులోని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. చివరగా నేను చెప్పేదేమిటంటే.. మీకు, మీ బిల్డరుకు మధ్య ఉన్న అవగాహన ఆధారంగా మొత్తం జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది.

DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.

Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.

Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4

Coming Soon...
Temple Town 5

For Free Site Visit and more details please call: 9849068590

Click here to Chat with us on WhatsApp

No comments:

Post a Comment