12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిన జీఎస్టీ
‘అందుబాటు ధరల ఇళ్ల’పై పన్ను 1 శాతమే
ఏప్రిల్ 1 నుంచి అమలు
దిల్లీ: ఇళ్ల కొనుగోలుదార్లకు ఊరట కలిగించేలా పన్ను భారాన్ని తగ్గిస్తూ వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకొంది. ఆదివారం జరిగిన మండలి 33వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న (అండర్ కన్‌స్ట్రక్షన్) ఇళ్లపై జీఎస్టీ శాతాన్ని 12 శాతం నుంచి 5 శాతానికి; అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లపై పన్నును 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించినట్టు వివరించారు. కొత్త విధానంలో బిల్డర్లుకు ఇన్‌పుట్ ట్యాక్స్ కెడ్రిట్ (ఐటీసీ) చెల్లించడం రద్దవుతుంది. ఈ నిర్ణయాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు;గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా నిర్మాణం పూర్తయినట్టు ఇంకా ధ్రువపత్రాలు రాని ఇళ్లకు 12 శాతం పన్ను విధిస్తున్నారు. చెల్లించిన పన్నులో కొంత మొత్తం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో బిల్డరుకు వాపసుగా వస్తుంది. తాజాగా బిల్డర్లు ఐటీసీని పొందే సౌకర్యాన్ని రద్దు చేస్తూ జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది.
నిర్మాణం పూర్తయిన ఇళ్లు
కొనుగోలు చేసిన సమయానికి నిర్మాణం పనులన్నీ పూర్తయినట్టు ధ్రువపత్రం లభించి ఉంటే అలాంటి ఇళ్లపై జీఎస్టీ ఉండదు. దీనివల్ల పనులు పూర్తి కావడంపై వినియోగదారుడు వేచి చూసే సమయం తగ్గుతుందని జైట్లీ అన్నారు. బిల్డర్లు త్వరగా పనులు పూర్తి చేసే అవకాశం ఉందని, తద్వారా నిర్మాణ రంగంలోకి నిధుల ప్రవాహం పెరుగుతుందని చెప్పారు.
ఎందుకీ మార్పులు?
పన్ను వాపసుకు ఉద్దేశించిన ఐటీసీని బిల్డర్లు తమకు బదలాయించడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో మార్పులు చేయవలసి వచ్చిందని కేంద్ర మంత్రి జైట్లీ తెలిపారు. ఈ సమస్యపై గుజరాత్ ఆర్థిక మంత్రి నితిన్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రుల బృందం అన్ని విషయాలను చర్చించి నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఆ మేరకు ఐటీసీ విధానాన్ని ఎత్తివేసి పన్ను రేటును తగ్గించామని చెప్పారు.
మధ్యలో ఉన్న ప్రాజెక్టుల మాటేమిటి?
ఇప్పటికే పనులు ప్రారంభమయి ఒక దశకు చేరుకున్న ప్రాజెక్టులకు ఏ నిబంధనలు అమలు చేయాలన్న విషయమై చర్చించడానికి అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు జైట్లీ తెలిపారు. ఇది మార్గదర్శకాలను రూపొందిస్తుందని చెప్పారు. ఫిట్‌మెంట్ కమిటీ, లా కమిటీలు సమావేశమయి మార్చి పదో తేదీ నాటికి మార్గదర్శకాలు ఇస్తాయని తెలిపారు. వీటిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చిస్తామని తెలిపారు.
దుకాణాలు ఉన్న అపార్టుమెంట్ల విషయంలో ఎలా?
వాణిజ్య అవసరాలు, దుకాణాలకు కొంత స్థలం విడిచిపెట్టే అపార్టుమెంట్ల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపైనా అధికార్ల బృందం చర్చించనుంది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలు స్వీకరించనుంది. అపార్టుమెంట్లలో వాణిజ్య అవసరాలను స్థలం కేటాయించడాన్ని అనుమతించాలా? వద్దా? ఒకవేళ అంగీకరిస్తే ఎంత శాతం వరకు అనుమతించాలి? అన్న అంశాలను పరిశీలించనుంది.
నగదు లావాదేవీలకు అడ్డుకట్ట
స్థిరాస్తి రంగంలో నగదు లావాదేవీలకు అడ్డుకట్టవేయడానికి, సరఫరాదార్లలో జవాబుదారీతనం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు జైట్లీ తెలిపారు. అందువల్ల బిల్డర్లు పెద్ద మొత్తంలో భవన నిర్మాణ సామగ్రిని రిజిస్టర్డు అయిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మొత్తం 80 శాతం సరకులను రిజిస్టర్డు డీలర్ల వద్దే కొనుగోలు చేసేలా మంత్రుల బృందం ప్రతిపాదించిందని తెలిపారు. దీనిపై చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా అభ్యంతరం తెలిపారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ రంగానికి ఇది మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతుందని చెప్పారు. తనిఖీల పేరుతో అధికారుల వేధింపులు మళ్లీ మొదలవుతాయని, హవాలా మార్గంలో నగదు సరఫరా చేశారంటూ బిల్డర్లను ప్రశ్నించడం ప్రారంభమవుతుందని అన్నారు.
లాటరీలపై నిర్ణయం వాయిదా
లాటరీలపై ఎంత జీఎస్టీ ఉండాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైట్లీ తెలిపారు. దీనిపై ఏర్పాటయిన మంత్రుల బృందం మరోసారి సమావేశమయి చర్చిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తున్న లాటరీలపై 12 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో నడుస్తున్న లాటరీలపై 28 శాతం జీఎస్టీ ఉంది.

8 శాతం నుంచి ఒక శాతానికి
‘అందుబాటు ధరల ఇళ్లు’ (అఫర్డబుల్ హౌసింగ్)కు ప్రస్తుతం ఉన్న 8 శాతం పన్నును ఒక శాతానికి తగ్గించారు. రూ.45 లక్షల లోపు విలువ ఉన్న ఇళ్లు కానీ, మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు, ఇతర నగరాల్లో 90 చదరపు మీటర్ల వైశాల్యంగానీ ఉన్న ఇళ్లకు ఇది వర్తిస్తుంది. దిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి-ఎంఎంఆర్, కోల్‌కతాలను మెట్రో నగరాలుగా గుర్తించారు. దీనిపై జైట్లీ మాట్లాడుతూ..‘‘వైశాల్యం (కార్పెట్ ఏరియా), ధరల ఆధారంగా ‘అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్ల’కు రెండు నిర్వచనాలు ఇచ్చాం. కాస్త పెద్ద ఇళ్లను కూడా ఈ విభాగంలో చేర్చాం. 60 చదరపు మీటర్ల ఇల్లు అంటే దాదాపుగా డబుల్ బెడ్‌రూం ఇల్లు, 90 చదరపు మీటర్ల ఇల్లు అంటే త్రిబుల్ బెడ్ రూం ఇల్లుగా పరిగణించవచ్చు’’ అని చెప్పారు. ఇంతవరకు ఈ తరహా ఇళ్లకు ధర ఆధారంగా పన్ను విధించడం లేదు. వైశాల్యంలో కూడా ప్రాజెక్టుకు ప్రాజెక్టుకు మధ్య తేడాను చూపిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఒకే తరహా విధానం అమల్లోకి రానుంది. |
ఇదో విప్లవాత్మక అడుగు
అందుబాటు గృహాలు, ఫ్లాట్లకు జీఎస్‌టీ రేట్లను తగ్గిస్తూ జీఎస్‌టీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్థిరాస్తి పరిశ్రమ స్వాగతించింది. కొనుగోలుదార్ల సెంటిమెంటు మెరుగై గృహాల అమ్మకాలకు ఊతం లభిస్తుందని అభిప్రాయపడింది. జీఎస్‌టీ మండలి తాజా నిర్ణయంపై స్థిరాస్తి పరిశ్రమ ప్రతినిధుల స్పందన ఇలా..
అందుబాటు గృహాలపై జీఎస్‌టీ రేటును 1 శాతానికి తగ్గించడం దేశీయ స్థిరాస్తి రంగంలో ఓ విప్లవాత్మక మార్పు. గృహ కొనుగోళ్లదార్లకు అతి పెద్ద ఊరట కలిగించే నిర్ణయం ఇది. కొనుగోలుదార్ల సెంటిమెంటు బలపడేందుకూ దోహదం చేస్తుంది.

- జక్సయ్ షా, అధ్యక్షుడు, క్రెడాయ్
జీఎస్‌టీ మండలి నిర్ణయంపై స్థిరాస్తి పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది స్వాగతించదగిన పరిణామం. గిరాకీ పరిస్థితులు మెరుగయ్యేందుకు ఇది దోహదం చేస్తుంది.
- నిరంజన్ హీరానందని, ప్రెసిడెంట్, నారెడ్కో
ఇబ్బందులతో సతమతమవుతోన్న స్థిరాస్తి రంగానికి జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ఉపశమనం చేకూర్చే నిర్ణయం. 2019లో ఈ రంగం ఎంతోకొంత పురోగతి బాట పట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుబాటు గృహాల ధర శ్రేణి పరిమితిని సవరించడం కూడా స్థిరాస్తి పరిశ్రమకు ఉత్తేజమిచ్చేదే.
- అనుజ్ పురి, ఛైర్మన్, అనరాక్
గిరాకీ పరిస్థితులను మెరుగుపర్చే దిశగా జీఎస్‌టీ మండలి తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇది. గత కొన్ని త్రైమాసికాలుగా గృహాల అమ్మకాలు స్తబ్దుగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిణామంతో గిరాకీ పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది.
- చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ
స్థిరాస్తి రంగానికి ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం ఇది. దేశ ఆర్థిక వ్యవస్థ కీలకమైన ఈ రంగ వృద్ధికి ఇది దోహదం చేస్తుంది. గృహ అమ్మకాల గిరాకీ మెరుగవ్వడమే కాకుండా ఉద్యోగ సృష్టికి కూడా తోడ్పడుతుంది. పన్ను విధానమూ మరింత సరళీకృతం అవుతుంది.
- శిశిర్ బైజాల్, సీఎండీ, నైట్ ఫ్రాంక్ ఇండియా
Courtesy: Eenadu 25/02/2019
DTCP Approved Residential Open Plots are available at Yadagirigutta near Hyderabad-Warangal National Highway 163. All the ventures are located in prime location which will give a very fast appreciate to the property.
Bhuvaneshwari Properties is an ISO 9001:2015 certified Company in Real Estate category in India. It is the first RERA Registered Company in Yadadri Corridor.
Following Ventures are available:
Temple TownTemple Town 1Temple Town 2Temple Town 3Temple Town 4
Coming Soon...
Temple Town 5
For Free Site Visit and more details please call: 9849068590

No comments:
Post a Comment